
SSMB29 Location | ఒడిశా అడవుల్లో జక్కన్న | ABP Desam
రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా నుండి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే వైరల్ అవుతుంది. మహేష్ లొక్స్ విషయంలో జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్ మొహం కూడా బయటకి కనిపించకుండా సీక్రెట్ గా ఉంచుతున్నారు. కానీ ఎదో ఒక విధంగా మహేష్ లుక్ వైరల్ అవుతూనే ఉంది. అయితే ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రూపొందుతుందని ఒక టాక్ కూడా వినిపిస్తుంది. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెర్రకెక్కిస్తున్నారు.
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని అడవి ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. తాజాగా రాజమౌళి ఒక వీడియో షేర్ చేసారు. ఓడిశాలోని డియోమాలి ప్రాంతంలో సోలో ట్రెక్కింగ్ కి వెళ్లినట్టు చెప్పుకొచ్చారు. ఈ వీడియో చూసిన మహేష్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ అడవిలోనే మహేష్ షూట్ జరుగుతుందని, లొకేషన్ అప్డేట్ వచ్చేసిందని తెగ సంబరపడిపోతున్నారు. ఆ వీడియోలో ఉన్న లొకేషన్స్ చూసి సినిమాపై ఉన్న హైప్ ని మరింత పెంచుతున్నారు.
జక్కన షేర్ చేసిన ఈ వీడియోలో ఒక సందేశం కూడా ఇచ్చారు. తాను వెళ్లిన ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉందని, కానీ మనం మన ప్రకృతిని గౌరవించి జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పారు. ట్రెయిల్‌లో చెత్త చూసి చాలా బాధపడ్డాను. ఇలాంటి ప్రకృతి సౌందర్యాన్ని మనం గౌరవించాలి. కొంచెం బాధ్యతతో ఈ ప్రదేశాలను కాపాడవచ్చు… తమ చెత్తను తమతో తిరిగి తీసుకెళ్లాలి అంటూ రాసుకొచ్చారు జక్కన్న.