SS Rajamouli Reveals SSMB 29 Mahesh babu Pre look | రాజమౌళి నుంచి ఊహించని సర్ ప్రైజ్ | ABP Desam

 ఎస్ ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్ లో సినిమా షూటింగ్ కూడా మొదలైంది. కానీ కనీసం ఒక్క పూజ ఫోటో కూడా పెట్టలేదే అని తెగ ఫీలైపోతున్న ఫ్యాన్స్ కి మహేశ్ బాబు పుట్టినరోజు నాడు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చాడు జక్కన్న. రెండు వార్తలు చెప్పాడు. ఒకటి మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేశ్ బాబు ప్రీ లుక్ ఫోటో ను రిలీజ్ చేశాడు. రెండోది ఈ సినిమా ఏంటీ..దీని లైన్  ఏంటీ..ఈ సినిమా ఏ కాన్సెప్ట్ లో తీస్తున్నారనే డీటైల్స్ మొత్తం క్లారిటీ ఇచ్చేలా రాజమౌళి స్టైల్ లో నవంబర్ లో ఓ భారీ సర్ ప్రైజ్ ఉంటుందని చెబుతూ ఇంకో పోస్ట్ పెట్టారు.  మహేశ్ బాబు ఫోటోలో ఏముందో చూద్దాం. కేవలం మహేశ్ ఛాతీ మాత్రమే కనిపించేలా ఫోటో పెట్టారు. మహేశ్ మెడలో శివుడి జపమాల ఉన్నాయి. లాకెట్ గా మూడు నామాలు, త్రిశూలం, ఢమరుకం, నంది ఉన్నాయి. ఇండియా జోన్స్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్ కి ఇండియన్ మైథాలజీ టచ్ ఇచ్చినట్లు ఉన్నారు. ఎండ్ మహేశ్ మెడపైన గాయమైనట్లు ఉంది. బ్లడ్ కారుతూ ఉంది. అంతే ఈ ఫోటో తో జక్కన్న చెప్పింది. హ్యాష్ ట్యాగ్ గ్లోబ్ ట్రాటర్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ఫస్ట్ రివీల్ ఆన్ నవంబర్ 2025 అని ఇచ్చారు. గ్లోబ్ ట్రాటర్ అంటే తెలుసుగా ప్రపంచమంతా తిరిగే వాడు అని అర్థం. మిగిలింది అంతా నవంబర్ లో మాట్లాడుకుందాం అంటున్నాడు. మొత్తానికి బాబ్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ సంబరపడేలా అట్లీస్ట్ ఈ పిక్ అన్నా రివీల్ చేసినందుకు జక్కన్నకు మహేశ్ ఫ్యాన్స్ థాంక్స్ చెప్పుకోవాలేమో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola