ABP News

Sobhita reveals her love story with Naga Chaitanya | నాగ చైతన్య, శోభిత లవ్ స్టోరీ | ABP Desam

Continues below advertisement

సమంతతో నాగ చైతన్య డివోర్స్ తీసుకున్న కొన్నాళ్లకి శోభితతో లవ్ లో ఉన్నట్టు ఎన్నో రూమర్స్ వచ్చాయి. వాటిని నిజం చేస్తూ వీళిద్దరి నిశ్చితార్థం ఫొటోస్ ని షేర్ చేసారు నాగార్జున. వీళిద్దరి వివాహం డిసెంబర్ 2024లో అక్కినేని స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. అయితే నాగ చైత‌న్య‌, శోభిత ధూళిపాళ రీసెంట్ గా వోగ్ మ్యాగజిన్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూలో శోభిత ఎన్నో విష‌యాల‌ను రివీల్ చేసింది. తమ లవ్ స్టోరీ, పరిచయం, ఇలా పలు విషయాల గురించి షేర్ చేసుకున్నారు.  

ఈ ఫోటో షూట్ కి చై శోభిత నవ్వుతు ఫోజులిచ్చారు. చైత‌న్యను క‌ల‌వ‌క‌ముందు తాను ముంబైలోనే సెటిల్ అవాల‌నుకున్న‌ట్టు, ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన వ్య‌క్తితో రిలేష‌న్ లోకి వెళ్ల‌కూడ‌దనుకున్న‌ట్టు తెలిపింది శోభిత. 

శోభిత తెలుగు మాట్లాడడం చైతన్యకి నచ్చుతుందట.  మాట్లాడే విధానం తనకి బాగా నచ్చుతుందని, నేను కూడా తెలుగు స్పష్టంగా మాట్లాడడం నేర్చుకుంటున్నానని అన్నాడు చైతూ. ఈ ఫోటో షూట్ చై శోభిత నవ్వుతు ఫోజులిచ్చారు. చైత‌న్యను క‌ల‌వ‌క‌ముందు తాను ముంబైలోనే సెటిల్ అవాల‌నుకున్న‌ట్టు, ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన వ్య‌క్తితో అసలు రిలేష‌న్ లోకి వెళ్ల‌కూడ‌దనుకున్న‌ట్టు తెలిపింది శోభిత. 

కానీ చైత‌న్య‌ను క‌లిశాక త‌న ఆలోచ‌నా విధానం మొత్తం మారిపోయిందని శోభిత చెప్పింది. చైతూ ఎంతో బ్యాలెన్డ్స్ గా,చాలా క్లియ‌ర్ మైండ్ తో ఉంటాడ‌ని, చైతూని క‌లిసేవ‌ర‌కు అత‌ను అంత డౌన్ టూ ఎర్త్ ప‌ర్స‌న్ అని త‌న‌కు తెలియ‌ద‌ని, తనని చూసి షాక‌య్యాన‌ని చెప్పుకొచ్చింది. ఏ ప‌నినైనా చైతూ 100% చేస్తాడట. 

చేసే ప‌నిలోనే చైత‌న్య త‌న ఆనందాన్ని వెట్టుకుంటాడట. తన బైక్ ని  రెండు గంటలు పాటు క్లీన్ చేస్తాడట చైతన్య. సిట్యువేషన్ ఏదైనా కూడా పాజిటివ్ కోణంలోనే చైతు చూస్తాడు. సక్సెస్. ఫెయిల్యూర్ ని ఒకటేలా చుస్తాడంట నాగ చైతన్య. క‌స్ట‌డీ ఫెయిల్ అయిన‌ప్పుడు చైతూ ఎలా ఉన్నాడో, తండేల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన‌ప్పుడు కూడా తాను అలానే ఉన్నాడ‌ని అంటోంది.

వీటితో పాటు తమ లవ్ స్టోరీని కూడా షేర్ చేసుకుంది శోభిత. ఒక‌రోజు తాను ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ చేస్తున్న‌ప్పుడు తాను నాగ‌చైత‌న్య ను ఎందుకు ఫాలో అవ‌డం లేద‌ని ఓ నెటిజ‌న్ అడిగాడ‌ట‌. ఆ త‌ర్వాత చైతూ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే అత‌ను ఫాలో అవుతున్న 70 మందిలో తాను కూడా ఉండ‌టం చూసి షాకై, అత‌న్ని తిరిగి ఫాలో అయిన‌ట్టు ఆమె తెలిపింది. 

అలా వాలు చాటింగ్ చేయడం మొదలు పెట్టారు.  వారి మ‌ధ్య చాటింగ్ జ‌రిగి ఇద్ద‌రికీ ఉన్న కామ‌న్ ఇంట్రెస్ట్ ల గురించి మాట్లాడుకున్నార‌ట‌. వీళిద్దరి లవ్ స్టోరీ కూడా ఫుడ్ తో నే స్టార్ట్ అయింది. చైత‌న్య ఎక్కువ‌గా సుషీ గురించి పోస్ట్ చేసేవాడ‌ని, అది చూసి ఎట్రాక్ట్ అయ్యాన‌ని అంటుంది శోభిత. 2022లో లంచ్ డేట్ కోసం చైత‌న్య త‌న కోసం ముంబై వెళ్ళాడట. ఆ తర్వాత నుండే రూమర్స్ స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఏదేమైనా తమ హీరో ఇప్పుడు చాలా హ్యాపీగ ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు చైతు ఫ్యాన్స్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram