Sita Ramam Trending : మోడ్రన్ క్లాసిక్ 'సీతారామం' వదులుకుని ఫీలై ఉంటారు..! | ABP Desam
సీతారామంతో హను రాఘవ పూడి వెండితెరపై మ్యాజిక్ చేశారు. యుద్ధంతో రాసిన ప్రేమకథపై ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. లెఫ్టినెంట్ రామ్ గా దుల్ఖర్ సల్మాన్, సీతామహాలక్ష్మిగా మృణాల్ ఠాకూర్, ఆఫ్రీన్ పాత్రలో రష్మిక మందన్నా తమ పాత్రలను అత్యద్భుతంగా పోషించారు. స్క్రీన్ పై హను చూపించిన మ్యాజిక్, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కలిసి ఐ ఫీస్ట్ లా ఉన్నాయంటూ ప్రేమకురిపిస్తున్నారు.