Sandeep Kishan about Naveen Chandra | కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న వ్యక్తి నవీన్ చంద్ర | ABP Desam
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలెవెన్ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్రపై సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. అసలు 11 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రావాలా వద్దా అనే సందేహం తనలో ఉందన్నారు సందీప్ కిషన్. ఓ వైపు దేశ సరిహద్దుల్లో పరిస్థితులు బాగో లేనప్పుడు సినిమా ఫంక్షన్ కి రావటం బాగోదని చాలా సార్లు ఆలోచించాచనన్నారు సందీప్ కిషన్. అయితే సీజ్ ఫైర్ అనౌన్స్ చేయటంతో హమ్మయ్య అనుకుంటూ యుద్ధం ఆగిందన్న ఆనందంలో నవీన్ చంద్ర సినిమా ఫంక్షన్ కి వచ్చేశానన్నారు సందీప్ కిషన్. అయితే సందీప్ కిషన్ నవీన్ చంద్ర ఇద్దరూ తెలుగు తమిళ భాషల్లో పనిచేయటంపై మాట్లాడారు సందీప్ కిషన్. భాష చూసుకోకుండా సినిమాని ప్రేమించే వ్యక్తులమన్న సందీప్ కిషన్ చాలా సార్లు రెండు భాషల్లో డబ్బింగ్ చెప్పాలన్నా కష్టంగా ఉంటుందని కానీ రెండు భాషల్లోనూ అభిమానులకు చేరువ అవుతామని చెప్పాడు సందీప్ కిషన్.