Samantha Special Song: పుష్ప చిత్రంలో సమంత స్పెషల్ సాంగ్ విడుదల| ABP Desam

Continues below advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్... ఈ ముగ్గురి కలయికలో రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి... 'ఆర్య'. రెండోది 'ఆర్య 2'. రెండిటిలో స్పెషల్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. 'ఆర్య'లో 'అ అంటే అమలాపురం', 'ఆర్య 2'లో 'రింగ రింగ...' - రెండూ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. అందువల్ల, ఈ ముగ్గురి కలయికలో వస్తున్న మూడో సినిమా 'పుష్ప: ద రైజ్'లో స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందోననే ఆసక్తి ఏర్పడింది. పైగా, సమంత ఆ సాంగ్‌లో సందడి చేయనున్నారనే వార్త అంచనాలు మరింత పెంచింది. ఈ సాంగ్ ఎలా ఉంటుందోననే ఆసక్తికి ఫుల్ స్టాప్ పడింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram