Samantha Is Back In Naga Chaitanya Llife | Sobhitaతో ఎంగేజ్‌మెంట్ తరువాత మళ్లీ చై జీవితంలోకి సమంత

Samantha Is Back In Naga Chaitanya Llife |

ఫస్ట్ మ్యారేజ్, డివోర్స్ నుంచి నాగ చైతన్య మూవ్ ఆన్ అయ్యారు. శోభితతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అయినా సరే ఆయనను సమంత వదల్లేదు. అవునా.. ఎలా ఎందుకు అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం.సమంత అంటే హీరోయిన్ సమంత ఒక్కరే ఉంటారా. ఆ పేరుతో చాలా మంది ఉంటారు కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్న శోభిత చెల్లెలి పేరు కూడా సమంతే. అదన్నమాట సంగతి. సమంత ధూళిపాళ్ల ఇదే ఆమె ఇన్ స్టా గ్రామ్ అకౌంట్. తనో డాక్టర్.  నాగచైతన్య,శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా ఆమె ఇన్ స్టాలో అప్ లోడ్ చేశారు.సమంత జ్ఞాపకాల నుంచి దూరం వెళ్దామనుకునే ప్రయత్నంలో ఉన్న నాగచైతన్య కు మళ్లీ శోభిత రూపంలో సమంత పేరు వినిపిస్తోందని ఇప్పుడు అంతా అంటున్నారు. దీంతో.. సమంత ఒక ఎమోషన్ ఎప్పటికీ దూరం కాలేవు చై అంటూ సమంత ఫ్యాన్స్ పోస్టులు పెడుతుంటే... ఏంటీ మళ్లీ సమంతనా..? ఇది మాకు పోదా అంటూ నాగచైతన్య ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అలా..కొత్తగా ఎంగేజ్మెంట్ వేళ సరికొత్త సమంత వల్ల మళ్లీ హాట్ టాపిక్ గా మారాడు నాగచైతన్య. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola