RRR team in Mumbai| ట్రైలర్ ప్రమోషన్ లో బిజీ గా RRR టీం

RRR' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా మూవీ టీమ్ ముంబైలో సందడి చేసింది. ఈ మేరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్'' లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించారు. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా అద్భుతమైన ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా తారక్ నటన గురించి మాటల్లేవ్. అయితే ఈ ట్రైలర్ లాంచ్ కోసం RRR టీమ్ మొత్తం ముంబైకి చేరింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎయిర్ పోర్టులో దిగిన విజువల్స్, ఫొటోస్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola