
RC 16 Ram Charan Peddi First Look | రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC16 టైటిల్, ఫస్ట్ లుక్ | ABP Desam
ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 16 వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈరోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ అండ్ లుక్ ను విడుదల చేశారు. RC 16కి పెద్ది అని పేరు పెట్టారు. కంప్లీట్ ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న పెద్ది సినిమాలో రామ్ చరణ్ లుక్ చూస్తే కంప్లీట్ విలేజ్ లుక్ లో ఊరమాస్ గా ఉంది. ముక్కుకు పెద్ద పోగు..మూడేసి అగ్గిపుల్లలతో బీడీ వెలిగించుకుని కాలుస్తూ కంప్లీట్ రగ్గ్ డ్ లుక్ లో కనిపిస్తున్నాడు రామ్ చరణ్. రెండు పోస్టర్లు రిలీజ్ చేశారు ఒకటి కంప్లీట్ ఫేస్ క్లోజప్. కొంచెం పుష్ప లుక్స్ కూడా ఉన్నాయి. రెండోది సైడ్ పోస్టర్. చేతిలో ఏదో ఆబ్జెక్ట్ పట్టుకుని ఉన్నాడు. కంప్లీట్ డీటైలింగ్ లేదు. వెనుక ఊళ్లో ఏదో జాతర జరుగుతున్నట్లు లైటింగ్ సెటప్ ఉంది. చూడాలి. ఉప్పెన సినిమా తర్వాత బుచ్చి బాబు నుంచి వస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ క్రూషియల్ రోల్ లో కనిపించనున్నారు.