Rajendra prasad Murali Mohan Padma Shri | నటకిరీటి, సహజ నటుడికి పద్మశ్రీలు | ABP Desam

  గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సినీ రంగం నుంచి ధర్మేంద్రకు మరణానంతరం దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టిని పద్మభూషణ్ తో గౌరవించింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సహజనటుడు మురళీ మోహన్ లను పద్మశ్రీ వరించింది. గడచిన యాభై ఏళ్లుగా అనేక చిత్రాల్లో వీరిద్దరూ సినీరంగానికి అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం కళారంగంలో పద్మశ్రీని ప్రకటించి రాజేంద్ర ప్రసాద్ ను, మురళీ మోహన్ ను గౌరవించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనను ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్ కు సినీ ప్రముఖులు అభినందలను తెలియచేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola