రాధేశ్యామ్ ప్రీరిలీజ్ యాంకర్,స్పెషల్ గెస్ట్ పూర్తి వివరాలు|

Continues below advertisement

రాధేశ్యామ్... ఈ సినిమా కోసం డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ హవా చూస్తే తెలిసిపోతుంది. ప్యారిస్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ చిత్రంపై అభిమానులకు భారీ అంచనాలే నెలకొన్నాయి. జనవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 23న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం ఏ సినిమా ఈవెంట్ కి అయినా... స్టార్ల కంటే ముందు ఆ ఈవెంట్ హోస్ట్ చేసే యాంకర్లే ముఖ్యం. అలా ఇప్పుడు రాధేశ్యామ్ ఈవెంట్ ను మన జాతిరత్నం నవీన్ పోలిశెట్టి, జబర్దస్త్ యాంకర్ రష్మి ముందుకు తీసుకెళ్లనున్నారు. అయితే మన జాతిరత్నం కచ్చితంగా కార్యక్రమాన్ని మరింత వినోదాత్మకంగా చేస్తారని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇకపోతే ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ లు ఎవ్వరూ ఉండరట! మరి ట్రైలర్ ఎవరితో రిలీజ్ చేయిస్తారని ఆలోచిస్తున్నారా? ఫ్యాన్స్ తో అంట... ఇందుకోసం చిత్రబృందం ట్విటర్ లో ప్రత్యేక కాంటెస్ట్ కూడా పెట్టారు. కాకపోతే ప్రభాస్ ఇప్పటివరకు చేసిన సినిమాల డైరెక్టర్లు, ఇకముందు చేయబోయే డైరెక్టర్లు కూాడా ప్రీ రిలీజ్ కు రాబోతున్నారని తెలిసింది. వీరితోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మీడియా ఛానళ్లు ఈవెంట్ కు రానున్నారు. మరి ఈ ప్రీ రిలీజ్ ప్రోగ్రాం ఎంత వైభవంగా జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram