Pushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desam
అనుకున్నదే జరిగింది. పుష్పరాజు గాడి రప్పా రప్పాకు కలెక్షన్ల జాతర కొనసాగుతోంది. సినిమా విడుదలై పదకొండో రోజు అవుతున్నా రోజుకు వంద కోట్లకు తగ్గకుండా వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది పుష్ప 2. ఫలితంగా 11వరోజు సినిమా 1400కోట్ల రూపాయల కలెక్షన్లను అందుకుంది. ఇంకో 400 కోట్లు వస్తే బాహుబలి 2 సినిమా సాధించిన 1800 కోట్ల రూపాయల కలెక్షన్ల రికార్డులు కూడా బద్ధలు కావటం ఖాయం. డిసెంబర్ ఎండింగ్ వరకూ పుష్ప 2 సినిమా కు లాంగ్ రన్ ఉండటంతో క్రిస్మస్ సెలవులు అన్నీ కలిసి బాహుబలి 2 రికార్డులను పుష్ప 2 ఈజీగా బ్రేక్ చేసేస్తుందని ఫిలిం ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మన దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప2 నిలుస్తుంది. వాస్తవానికి ఈ లిస్టులో 2300కోట్లతో దంగల్ అగ్ర స్థానంలో ఉన్నా దంగల్ కు చైనాలో 1500కోట్ల కలెక్షన్ రావటంతో ఆ సినిమా బయట సాధించిన రికార్డుగానే దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో అయితే పుష్ప కు తిరుగే లేదు. ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ డబ్బింగ్ సినిమాగా తిరుగులేని రికార్డు నెలకొల్పింది పుష్ప 2 . ఇప్పటివరకూ బాలీవుడ్ నుంచే 561 కోట్ల రూపాయలు అల్లు అర్జున్ సినిమాకు. మొత్తంగా రాజమౌళి రికార్డ్స్ కొట్టడానికి అవకాశం ఉన్న డైరెక్టర్ కూడా తెలుగు వాడే కావటం..అతను కూడా రాజమౌళికి ఎంతో సన్నిహితుడైన సుకుమార్ కావటం ఆసక్తి రేపుతున్న అంశం