Pushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP Desam
పుష్ప 2 సినిమా చరిత్ర సృష్టించింది. ఈ సినిమా, బాహుబలి రికార్డును అధిగమించి, ఇండియన్ సినిమా వాణిజ్య రికార్డులను మార్చింది. అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 32 రోజుల్లోనే బాహుబలి కలెక్షన్లను వెనక్కి నెట్టి, ఇప్పటివరకు 1831 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంతవరకూ, బాహుబలి సినిమాకు చెందిన హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ రికార్డు ఉన్నా, ఇప్పుడు ఆ రికార్డు పుష్ప 2 మూవీ బ్రేక్ చేసింది. దంగల్ సినిమా చైనా మార్కెట్ నుండి వచ్చిన కలెక్షన్లతో ప్రపంచంలో ఎక్కువ కలెక్షన్లు సంపాదించగా, ఇండియాలో మాత్రం ఇప్పటివరకు బాహుబలి ముందు ఉంటే, ఇప్పుడు ఆ స్థానాన్ని పుష్ప 2 దక్కించుకుంది. ఇందులో గర్వకారణం ఏమిటంటే, ఈ రెండు సినిమాలు తెలుగు చిత్రాలు కావటం. తెలుగు సినిమాలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద గుర్తింపు పొందుతున్నాయి, ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు మరింత వెలుగునిస్తుంది. రాజమౌళి, సుకుమార్, అల్లు అర్జున్, ప్రభాస్ రాజు అందరూ తెలుగు వాళ్లే కావటంతో ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు