సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి భర్త పేరును తొలగించిన ప్రియాంక

Continues below advertisement

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను 2018 డిసెంబర్ లో పెళ్లి చేసుకుంది. తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకుందని ప్రియాంకపై విమర్శలు వచ్చాయి. కానీ అవేవీ పట్టించుకోకుండా.. తన మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. అయితే మధ్యలో ఈ జంట విడిపోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని.. ఎప్పటికప్పుడు నిక్ తో కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేసేది ప్రియాంక. అయితే ఈసారి నిక్-ప్రియాంకల డివోర్స్ రూమర్స్ చాలా బలంగా వినిపిస్తున్నాయి. దానికి ప్రూఫ్ కూడా చూపిస్తున్నారు నెటిజన్లు. ప్రియాంక తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి జోనస్ అనే పేరుని తొలగించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram