మెగా కంపౌండ్‌కి ప్రకాశ్ రాజ్ దూరమైనట్టేనా, పవన్‌తో ఎందుకీ గొడవ?

వదల బొమ్మాళి వదల అన్నట్టుగా..ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్‌ని పదేపదే కవ్విస్తున్నాడు నటుడు ప్రకాశ్ రాజ్. ట్వీట్‌లతోనే ఆగడం లేదు. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఏకంగా తమిళనాడు డిప్యుటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ముందే పవన్‌పై సెటైర్లు వేశారు. పేరు ఎత్తకుండానే ఘాటు విమర్శలు చేశారు. దాదాపు 15 రోజులుగా ఈ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇదంతా ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం. ఇదంతా దాటి ఓసారి చూస్తే...మెల్లగా ప్రకాశ్ రాజ్‌ మెగా కంపౌండ్‌కి దూరమవుతున్నారా అన్న ఫీలింగ్ కలుగుతోంది. మొదటి నుంచి ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ప్రకాశ్ రాజ్‌కి గట్టి సపోర్ట్ ఇచ్చింది. దాదాపు మెగా హీరోలందరి సినిమాల్లోనూ నటించారు ప్రకాశ్ రాజ్. ఒకప్పుడు ఇంద్ర సినిమా ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తూ ప్రకాశ్ రాజ్ ఇచ్చిన స్పీచ్‌ ఇప్పటికీ ఓ సెన్సేషనే. చిరంజీవిని అన్నయ్యా అంటూ సంబోధించారు. ఆ తరవాత ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసిన సమయంలోనూ పరోక్షంగా మెగా ఫ్యామిలీయే ప్రకాశ్ రాజ్‌కి అండగా నిలబడింది.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola