The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam

Continues below advertisement

  రాజాసాబ్ తో మన డార్లింగ్ ప్రభాస్ సంక్రాంతి సీజన్ ను స్టార్ట్ చేయటానికి సిద్ధమైపోయాడు. మారుతి డైరెక్షన్ లో, ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ ఏం చేస్తున్నాడనే డౌట్స్ లేకుండా ది రాజాసాబ్ ట్రైలర్ 2.0 తో క్లారిటీ ఇచ్చేశాడు మారుతి. ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది ఏంటో మా థంబ్ నెయిల్ లో చెప్పేశాం. ఎస్ కోట కోసం ముసలోడి ఆరాటం...ఆస్తి కోసం మనవడి పోరాటం. ముసలోడి ఆరాటం ఎందుకు అన్నామంటే ఆ కోటలో వేరే వాళ్లు ఎవ్వరూ అడుగుపెట్టకుండా తన అదుపులో ఉంచుకునేందుకు క్షుద్రశక్తులను కూడా తన మీదకు ఆవాహన చేసుకున్నట్లున్నాడు ప్రభాస్ వాళ్ల తాత కనకరాజు అదే సంజయ్ దత్. బట్ ఆయన అత్యాశను గమనించి ముసలోడి ఆటను కట్టించినట్లుంది ప్రభాస్ నాన్నమ్మ గంగమ్మ.  అసలు దేవనగర సంస్థాన జమిందారీ గంగాదేవి  గంగమ్మగా ఎందుకు బతుకుతోంది. ఆస్తినో...ఖజానాలనో తన సొంతం చేసుకోవాలనుకున్న కనకరాజు ఎలా చనిపోయాడు...ఎందుకు ప్రేతాత్మగా మారి ఆ ఇంటికి వచ్చినవాళ్లందిరీని వస్తువులతో, ఆర్కిటెక్చర్ తోనే ట్రాన్స్ లోకి తీసుకువెళ్లిపోతున్నాడు. సరే అంతటి ప్రమాదకరమైన ప్లేస్ కి గంగమ్మ తన మనవడైన రాజాసాబ్ ను ఎందుకు పంపించింది..ఇదే రాజాసాబ్ స్టోరీ అని ట్రైలర్ లో క్లియర్ గా చూపించేశారు. బహుశా మారుతి ఈ కాల్ తీసుకోవటానికి ఓ రీజన్ ఉండి ఉంటుంది. కథకు చాలా పెద్ద కాన్వాస్ ఉండటంతో దీనిపై డైరెక్ట్ గా థియేటర్లోకి వచ్చి తెలుసుకుంటే ఆ ఎక్స్ పీరియన్స్ ఎంజాయ్ చేయలేకపోవచ్చు ఫ్యాన్స్. అందుకే కథ ప్లాట్ ఏంటనేది ముందే అర్థమైపోతే ఆ హారర్ ఎలిమెంట్స్ ను థ్రిల్ ను ఫీల్ అయ్యేలా చేయొచ్చని భావించి ఉంటారు మ్యాగ్జిమం ప్లాట్స్, గ్రాఫిక్స్, సినిమాలో కీలకమైన సీజీ వర్క్ అంతా ట్రైలర్ లో పెట్టేశారు. మరి నాన్నమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తన ప్రేతాత్మ తాతతో రాజాసాబ్ చేసిన పోరాటం ఏంటో చూడాలంటే జనవరి 9 రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola