PM Modi Wishes to Virosh Wedding | విరోష్ పెళ్లికి ప్రధాని మోడీ అభినందనలు | ABP Desam
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఓ ఇంటివాడు కాబోతున్నారు. నేషనల్ క్రష్ రష్మికా మందన్నాను (Rashmika Mandanna) పెళ్లి చేసుకోబోతున్నాడు. తమ పెళ్ళికి వీళ్ళిద్దరూ 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్' (The Wedding Of Virosh) అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. విజయ్, రష్మిక పెళ్లి ఉదయ్ పూర్ వేదిక జరుగుతుంది. ఈ వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)ని ఆహ్వానించారు. ఈ తరుణంలో కాబోయే కొత్త జంటకు ఆయన శుభాభినందనలు తెలిపారు.
''విజయ్, రష్మిక వివాహానికి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ అత్యంత ఆనందకరమైన, శుభ సందర్భంలో దేవరకొండ, మందన్న... రెండు కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు, అలాగే శుభాకాంక్షలు. విజయ్, రష్మిక జీవితాల్లో అందమైన సరికొత్త అధ్యాయానికి ఈ పెళ్లి నాంది పలుకుతుంది. 'సఖా సప్తపదా భవ' అంటే ఏడు అడుగులు కలిసి నడిచి, జీవితాంతం స్నేహితులుగా ఉండాలనే స్ఫూర్తితో ఈ జంట ఒకటి కాబోతోంది'' అని ప్రధాని మోడీ లేఖలో పేర్కొన్నారు.