Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
అవతార్.......ఈ సినిమా తీయాలని జేమ్స్ కేమరూన్ అనుకున్నప్పుడు ఆయన తన కలకు తెరపై ప్రతిరూపం తీసుకురావటానికి దాదాపుగా 80వేల కోట్ల రూపాయలు కావాలని అనుకున్నారు. తన విజన్ ను నమ్మి అనేక కంపెనీలు అవతార్ ప్రొడక్షన్ లో భాగం అయ్యాయి. దాని రిజల్టే ఇప్పటి వరకూ అవతార్ రెండు పార్టులు కలిపి దాదాపు 4లక్షల 36వేల కోట్ల రూపాయల కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా సాధించాయి. ఏకంగా 100 దేశాల్లో 160 భాషల్లో ఇప్పుడు మూడో పార్ట్ అయిన అవతార్ ఫైర్ అండ్ యాష్ రిలీజ్ కి రెడీ అయిపోతోంది. దాదాపు ముఖేశ్ అంబానీ ఆస్తి అంత కలెక్షన్లు సంపాదించిన అవతార్ సినిమా కేవలం డబ్బులు సాధిస్తోంది కాబట్టే గొప్ప సినిమానా లేదా ఇప్పటివరకూ ప్రపంచ సినిమా చరిత్ర చూడని గ్రాఫిక్స్ ను చూపిస్తోంది కాబట్టి ఫేమస్ అయ్యాయా సమాధానం ఆ రెండే కాదు..మూడో విషయం కూడా ఉంది. అదే అసలు అవతార్ ను ఎందుకు అందరూ తప్పని సరిగా చూడాల్సిన సినిమానో చెబుతోంది. ఈ వారం హాలీవుడ్ ఇన్ సైడర్ అవతార్ స్పెషల్.