Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్

Peddi Trailer Launch:  పెద్ది మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చాలా ఫన్నీ కామెంట్స్ వచ్చాయి. డైరక్టర్ బుచ్చిబాబు మామూలోడు కాదని హీరోయిన్ జాన్వీ కపూర్ బాగా పొగిడేసింది. బుచ్చి.. తన లుక్‌ మొత్తాన్ని మార్చేశారని చెప్పింది. తన డైలాగ్, మాడ్యులేషన్ అన్ని మారిపోవడానికి కారణం ఆయనే అని చెప్పింది. చాలా అమాయకుడులా కనిపిస్తాడు కానీ.. దేశంలోనే అతిపెద్ద రౌడీ డైరక్టర్ అని జాన్వీ చెప్పింది. కొన్ని రోజుల్లోనే తనకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారని..ఒక్కోసారి తనకు వర్క్ లేకపోయినా ఆ ఫోన్ చేస్తూనే ఉన్నా అని చెప్పారు. పెద్ది మూవీలో జాన్వీ కొంచం టఫ్‌గా ఉండే పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించారు. ట్రైయిలర్‌లో డైలాగ్స్.. యాటిట్యూట్ చూశాక జాన్వీ కపూర్ కారెక్టర్‌ను మంచి జోష్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు అర్థమవుతోంది. బుచ్చిబాబు.. పూర్తిగా తనను ఆ స్టైల్‌లోకి మార్చేశారని ఆమె పొగిడారు.  చరణ్ ఈ సినిమా  కోసం ప్రాణం పెట్టి నటించారని.. అవుట్‌పుట్ అద్భుతంగా ఉందని చెప్పింది జాన్వీ..

 

పెద్ది ట్రైలర్ లాంచ్ మరిన్ని వీడియోల కోసం: https://www.youtube.com/@ABPDesam ఫాలో కండి..

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola