Pawan Kalyan Interview on Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుపై పవన్ కళ్యాణ్ Exclusive ఇంటర్వ్యూ

     క్షమించండి. నేను ఇంగ్లీషులో మాట్లాడతాను. హరిహర వీరమల్లు మొఘల్ పాలనా కాలంలో ప్రత్యేకించి ఔరంగజేబు రాజ్యంలో ఉన్నప్పుడు జరిగిన కథ. కోహినూర్ డైమండ్ చుట్టూ కథ తిరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీపంలో కొల్లూరు వజ్రాల గనుల దగ్గర ఓ పిల్లాడికి దొరికింది. అక్కడి నుంచి అది ఎలా నిజాం ప్రభువుల దగ్గరకు అక్కడి నుంచి మొఘలుల చేతికి..అక్కడి నుంచి నెమలి సింహానం తో ఎలా బ్రిటీషర్ల చేతుల్లోకి వెళ్లిందో ఆ సమయంలో జరిగిన కథ. నెమలి సింహాసనం నుంచి కోహినూర్ వజ్రాన్ని హరి హర వీరమల్లు ఎలా కొట్టాశాడనే కల్పిత పాత్రతో ఈ సినిమా తీశాం. ఆ సమయంలో ప్రజల భావోద్వేగాలు ఎలా ఉండేవో అలాంటి భావాల నుంచి పుట్టిన వ్యక్తి హరి హర వీరమల్లు. సినిమా సాగే కొద్దీ అతని తత్వం ఏంటో మనకు తెలుస్తుంది. మొదటి పార్ట్ అతను ఢిల్లీ ప్రయాణానికి ఎందుకు సిద్ధమయ్యాడు ఎలా కోహినూర్ ఢిల్లీకి వెళ్లింది అనేంత వరకూ ఉంటుంది. రెండో పార్ట్ లో మొఘలుల నుంచి కోహినూర్ ఎలా వెనక్కి తీసుకురావాలనేంత వరకూ ఉంటుంది. ఆ టైమ్ లో కోహినూర్ మన సంస్కృతిలో భాగం. అందుకే కథ వినగానే నాకు బాగా కనెక్ట్ అయ్యింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola