Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam

Continues below advertisement

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో అత్యంత అరుదైన ఘనతను సాధించారు. పురాతన జపనీస్ కత్తిసాము కళగా పిలుచుకునే 'కెంజుట్సు'లో పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రవేశం పొందారు. మార్షల్ ఆర్ట్స్‌లో చారిత్రాత్మక ప్రపంచ గుర్తింపు ఉన్న కెంజెట్సులోకి వెళ్లటం అంటే బయట వ్యక్తులకు సాధ్యం కాని విషయం. కానీ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో ముఫ్పై ఏళ్లుగా చూపిస్తున్న ఆసక్తి...కేవలం నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, కొరియోగ్రాఫర్ గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో ప్రతిభను చాటుకుంటూ రాజకీయాల్లోనూ ప్రవేశించి యువత అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నందున పవన్ సేవలను గుర్తించిన 'సోగో బుడో కన్‌రి కై' సంస్థ...పవన్ కళ్యాణ్ కు ఫిఫ్త్ డాన్ (ఐదవ డాన్) పురస్కారం ఇవ్వటంతో పాటు కెంజుట్సు కత్తిని అందించింది. ఫలితంగా జపాన్ వెలుపల 'సోకే మురమత్సు సెన్సై'లోని 'టకెడా షింగెన్ క్లాన్'లో ప్రవేశం పొందిన తొలి భారతీయుడిగా పవన్ కళ్యాణ్ నిలిచారు. అంతేకాకుండా ఇదే కార్యక్రమంలో గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా పవన్ కళ్యాణ్ కు “టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే విశిష్ట బిరుదును అందించింది. జపాన్ యుద్ధకళలలో అగ్రగణ్యుడైన బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ పవన్ కళ్యాణ్ కు అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola