నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫమ్, ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సూపర్ హీరోలా
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహనుమాన్తో ప్యాన్ ఇండియా హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ..ఆ తరవాత Prasanth Varma Cinematic Universe అనౌన్స్ చేశాడు. ఈ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పుడు మరో మూవీ విడుదల కానుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. సూపర్ హీరో రోల్లో కనిపించనున్నారు. మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా ఈ మూవీ అనౌన్స్మెంట్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఈ ఫొటోలో మోక్షజ్ఞ చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు. ఇది కూడా ప్యాన్ ఇండియా మూవీయే. మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని ఎదురు చూసిన నందమూరి అభిమానులకు ఇలా గుడ్ న్యూస్ చెప్పాడు డైరెక్టర్. హనుమాన్ ఇచ్చిన హై నుంచి ఇప్పటికీ బయటకు రాని మూవీ లవర్స్...ఈ సారి మోక్షజ్ఞతో ఏం ప్లాన్ చేస్తున్నాడో అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అ!' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ, ఆ తర్వాత 'కల్కి', 'జాంబీ రెడ్డి' సినిమాలతో ఆకట్టుకున్నారు. సినిమాను ఎస్ఎల్వి సినిమా పతాకం మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని...ఈ సినిమాని ప్రజెంట్ చేయనున్నారు.