
Naga Chaitanya Engagement Sobhita Dhulipala |శోభిత, నాగ చైతన్యల లవ్ ట్రాక్ ...నేడే ఎంగేజ్మెంట్.?
Naga Chaitanya Engagement Sobhita Dhulipala | అక్కినేని నాగచైతన్య నేడు ఎంగేజ్మెంట్ కు సిద్ధమవుతున్నారు. అది కూడా నటి శోభిత ధూళిపాళ్లతో అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా కోడై కూస్తోంది. కొన్ని గంటలుగా ట్విట్టర్ లో ఇదే ట్రెండింగ్ టాపిక్. అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నేడు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారే వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఐతే.. ఈ విషయంపై అధికారికంగా అక్కినేని కుటుంబం నుంచి గానీ, శోభితా కుటుంబం నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఐనప్పటికీ..ఈ వార్త నిజమే ఐ ఉంటుందని ఫ్యాన్స్ పోస్టులు వేస్తున్నారు. ఎందుకంటే.. సమంతతో విడాకులు ఇచ్చిన తరువాత నాగచైతన్య నటి శోభితతో లవ్ లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇలా వీరి లవ్ ట్రాక్ పై ఇండస్ట్రీలో జోరుగా చర్చలు జరుగుతున్నప్పటికీ..వీళ్లిద్దరు మాత్రం మాట వరసకైనా దీనిని ఖండించలేదు. దీంతో.. వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారేమో అన్న ఫీలింగ్ ఫ్యాన్స్ లో వచ్చేసింది. అందుకే ఎంగేజ్మెంట్ జరుగుతుందని ఓ ప్రచారం జరగ్గానే.. 99శాతం నిజమే ఐ ఉంటుందని మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు, సినిమా వెబ్ సైట్స్, ఫ్యాన్స్ పేజీస్ ఈ వార్త గురించి పోస్టులు వేస్తున్నాయి.