MAA Election 2021: మా ఎన్నికల కోసం ప్యానెళ్ళు సిద్ధం.. మరి గెలుపు ఎవరి వైపు?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.  ప్రకాష్ రాజ్ ను ఢీ కొట్టేందుకు మంచు విష్ణు తన ప్యానెల్ తో రంగంలోకి దిగారు. తన ప్యానెల్ సభ్యులను ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. శుక్రవారం ప్యానెల్ సభ్యులందరితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారట మంచు విష్ణు. ఆ సమావేశంలోనే తన అజెండాను కూడా ప్రకటించనున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ను ప్రకటించారు. అతని ప్యానెల్ కన్నా బలమైన ప్యానెల్ ఎన్నుకుంటానని గతంలోనే మంచు విష్ణు అన్నారు. ‘మా’ కోసం మనమంతరం అనే స్లోగన్ తో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola