MohanBabu, Manchu Lakshmi to share Screen: తొలిసారిగా కలిసి నటిస్తున్న తండ్రీ కుమార్తెలు |ABP Desam

Collection King Dr.MohanBabu, ఆయన కుమార్తె Manchu Lakshmi కలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం.... ఫిబ్రవరిల 12న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి షాట్ కు Director Nandini Reddy దర్శకత్వం వహించగా... Manchu Manoj కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మంచు అవరామ్, మంచు విద్యా నిర్వాణ స్క్రిప్ట్ అందజేశారు. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ Prathik Prajosh తెరకెక్కిస్తున్నారు. తండ్రితో సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని లక్ష్మీ మంచు Social Mediaలో పేర్కొన్నారు. తాను కలలు కన్న రోజు ఇదని చెప్పారు. నా ఫస్ట్ హీరో, మా నాన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నటిగా ఓ అవార్డు అందుకున్నట్టు ఉందని Post చేశారు. ఈ సినిమా ఒక Crime Thriller అని దర్శకుడు తెలిపారు. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఒక షెడ్యూల్ లో పూర్తి చేస్తామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola