Manchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desam
సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడిన వివాదాలు రచ్చకెక్కి చివరకు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. జల్ పల్లిలో మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఘర్షణ జరిగింది. ముందుగా మంచు మనోజ్ ను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు పోలీసులు, మోహన్ బాబు బౌన్సర్లు. గేటు దగ్గర నిలబడి తనను లోపలికి రానివ్వాలని మనోజ్ ఎంత బతిమాలినా సెక్యూరిటీ లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో మనోజ్ గేట్లు విరగొట్టే ప్రయత్నం చేశారు. తీవ్ర పెనుగులాట తర్వాత మనోజ్ లోనికి వెళ్లారు. మనోజ్ కోసం బయటకు వచ్చిన మోహన్ బాబు మీడియా మాట్లాడించేందుకు ప్రయత్నం చేయగా మీడియా ప్రతినిధులపై దాడి చేశారు మోహన్ బాబు. జల్ పల్లిలో మంచు మోహన్ బాబు ఇంటివద్ద తీవ్ర ఘర్షణ జరిగింది. మోహన్ బాబు ఇంటిలోపలికి మనోజ్ రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో మనోజ్ జై శ్రీరామ్ అంటూ గేట్లు విరగొట్టారు. అక్కడ ఉన్న సెక్యూరిటీని ఉధ్దేశించి అరేయ్ మీసాలోడా నా కూతురు లోపల ఉంది తలుపులు తీయింటూ అరిచారు. చివరకు మోహన్ బాబు బయటకు వచ్చాక మనోజ్ ను లోపలికి వదిలారు. లోపలికి కూతుర్ని కలిసేందుకు మనోజ్ ప్రయత్నించగా ఆయన్ను బౌన్సర్లు అడ్డుకున్నారని మనోజ్ చెబుతున్నారు. తన చొక్కా చింపేశారని..బౌన్సర్లు కొడుతున్నారంటూ చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు మంచు మనోజ్.