ప్రభాస్ సినిమా వెనుక విజయ్ దేవరకొండ సినిమా...
Continues below advertisement
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'లైగర్'. రౌడీ బాయ్‌కు ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆగస్టు 25, 2022న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సరిగ్గా ఈ సినిమాకు రెండు వారాల ముందు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రభాస్ సినిమా వెనుక విజయ్ దేవరకొండ సినిమా... వచ్చే ఏడాది ఆగస్టులో టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన రెండు పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్నాయి అన్నమాట.
Continues below advertisement