Jr NTR and Rishabh Shetty Visit Keshavanatheshwara Temple | కర్ణాటకలో ఎన్టీఆర్ పూజలు.. సూపర్ వీడియో
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJr NTR and Rishabh Shetty Visit Keshavanatheshwara Temple | దేవర సినిమా షూటింగ్ నుంచి కొన్ని రోజులు విరామం తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ గత మూడు రోజులుగా కర్ణాటకలోలోని ప్రసిద్ధ పురాతన పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఆయన వెంట కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి, KGF and Salaar వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నారు. వీరంతా ఆలయాలు దర్శించుకునే పనిలో పడ్డారు. లెటెస్ట్ గా రిశబ్ శెట్టి స్వగ్రామానికి సమీపంలోని సుప్రసిద్ధ కేశవనాథేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. ఎన్టీఆర్ తో పాటు రిషబ్ శెట్టి, రిషబ్ శెట్టి సతీమణి ప్రగతి శెట్టి, ప్రశాంత్ నీల్ భార్య లిఖిత, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతీ సైతం గుహలో కొలువై ఉన్నకేశవనాథేశ్వరుడిని దర్శనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ ను రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకున్నాడు. ఇదంతా చూస్తుంటే కాంతార సినిమాలో ఎన్టీఆర్ కనిపిస్తాడనే ప్రచారం జరగుతోంది.