Jr NTR 30 Update : ఫ్యాన్స్‌ కొరటాల శివ సినిమా అప్డేట్ అడిగితే | ABP Desam

Continues below advertisement

కొరటాల శివ సినిమా అప్డేట్ గురించి అభిమానులు అందరూ అప్డేట్ కావాలని అడిగారు. అడిగితే సినిమా చేయడం లేదన్నారు. అలా ఆగిడితే ఆపేస్తానని చెప్పారు. ఆస్కార్స్ నుంచి వచ్చిన ఎన్టీఆర్... తన అభిమాని విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా సినిమా 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
అభిమానులు అందరూ కొత్త సినిమా అప్డేట్ కావాలని అడిగారు.
'ఆర్ఆర్ఆర్' సినిమా (RRR Movie) చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళలేదు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ... వివిధ కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అతి త్వరలో, ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది.
అన్నయ్య కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్ వేడుకలో దర్శక, నిర్మాతలపై NTR 30 Movie అప్డేట్స్ చెప్పమని ఒత్తిడి తీసుకు రావద్దని ఎన్టీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. అప్పుడు ఓ షెడ్యూల్ వేసుకున్నారు. అయితే, నందమూరి తారక రత్న మరణం తర్వాత ముందుగా అనుకున్న ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. ఈ నెలలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఎన్టీఆర్ 30 విషయానికి వస్తే... జాన్వీ కపూర్ కథానాయికగా నటించనున్నట్లు ఆమె పుట్టినరోజున అధికారికంగా వెల్లడించారు. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఇంకా అధికారికంగా చెప్పలేదు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram