Jani Master About Bengaluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీలో జానీ మాస్టర్..?ఇదిగో క్లారిటీ వీడియో

Jani Master About Bengaluru Rave Party  | బెంగళూరులో రేవ్ పార్టీ నటి హేమ పట్టుబడటం సంచలనంగా మారింది. ఆమెతో పాటు మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారనే ప్రచారం జరిగింది. తాను కూడా ఆ పార్టీలో ఉన్నారన్న ప్రచారాన్ని జానీ మాస్టర్ తీవ్రంగా ఖండించారు.

 

కర్ణాటక రాజధాని బెంగళూరులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు రైడ్ చేసి సోమవారం ఉదయం రేవ్ పార్టీని భగ్నం చేసిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు నటీనటులు, మోడల్స్ ఆ పార్టీలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని వార్తలు రావడంలో టాలీవుడ్ షేక్ అయ్యింది. హీరో శ్రీకాంత్ కూడా ఆ లిస్టులో ఉన్నారని ప్రచారం జరిగింది. దాన్ని ఆయన ఖండించారు. ఆ తర్వాత జానీ మాస్టర్ సైతం సదరు వార్తలను ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

జనసేనానిని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు - జానీ మాస్టర్
హైదారాబాద్ సిటీలో తన వాళ్ల మధ్య తీరిక లేకుండా తన పనుల్లో తాను నిమగ్నం అయ్యి ఉన్నానని జానీ మాస్టర్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''నేనెక్కడో, ఎవరితోనో, ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపారు. మా సేనని (జనసేన కార్యకర్తలను), జనసేనాని (పవన్ కల్యాణ్)ని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు'' అని జానీ మాస్టర్ ఘాటుగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola