James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో మహేశ్ బాబు నటించనున్నారా...ఇదేదో అబద్ధమో లేదా ఊరికే థంబ్ నెయిల్ కోసమే చెబుతున్నది కాదు. రాజమౌళి తలుచుకుంటే ఇది నిజంగానే సాధ్యమయ్యేలా ఉంది. రీజన్ అవతార్ పార్ట్ 3 ఫైర్ అండ్ యాష్ ప్రమోషన్స్ లో హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ స్వయంగా అన్నమాటనే. డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న అవతార్ 3 ప్రమోషన్స్ లో భాగంగా ఇండియన్ ఆడియెన్స్ కోసం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళికి జేమ్స్ కేమరూన్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా వారణాసి సినిమా గురించి మాట్లాడిన జేమ్స్ కేమరూన్ తనకు సెట్ కి రావాలని ఉందని రాజమౌళి పర్మిషన్ ఇస్తే వచ్చి షూటింగ్ చూస్తానని అడిగారు. మళ్లీ ఇంటర్వ్యూ ఎండింగ్ లో నేనేదో జోక్ గా అడిగానను అనుకోనని రాజమౌళికి మళ్లీ గుర్తు చేసిన జేమ్స్ కేమరూన్...నువ్వు పర్మిషన్ వచ్చి షూటింగ్ చూడటంతో పాటు మీ కెమెరా తీసుకుని కొన్ని సీన్స్ కూడా తీసి పెడతానని కూడా మాటిచ్చారు జేమ్స్ కేమరూన్.