Ira Khan Engagement Celebrations : సింపుల్ గా ఆమిర్ ఖాన్ కుమార్తె నిశ్చితార్థం వేడుక | ABP Desam

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్‌ (Ira Khan) త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనుంది. తన ప్రియుడు, ఫిటెనెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారేతో ఆమె వివాహం జరగనుంది. వీరి నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం ముంబయిలో వేడుకగా జరిగింది. ఆమిర్‌ఖాన్‌, ఐరా ఖాన్‌ తల్లి రీనా దత్తా, కిరణ్‌ రావు, ఫాతిమా సనా షేక్‌, ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు ఇతర కుటుంబసభ్యులు ఈ వేడుకల్లో పాల్గొని నూతన జంటను అభినందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola