పేరుతోనే మాయ చేయబోతున్న సుజిత్..?
Continues below advertisement
హమ్మయ్య... ఒక్క రోజు పూర్తయితే కానీ కుదరలేదు... హంగ్రీ చీతా గ్లింప్స్ ఇచ్చిన హ్యాంగోవర్ నుంచి బయటకు రావడానికి. మరి సుజిత్ చేసిన బ్లాస్ట్ ఆ రేంజ్ లో ఉంది మరి. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుష్. ఇక ఎప్పుడెప్పుడు ఇంకెలాంటి అప్డేట్స్ ఇస్తారో అని వెయిట్ చేస్తున్నారు. సరే అది పక్కన పెడితే.... ఈ సినిమా పేరు ఓజీ అని తెలిసిన దగ్గర నుంచి... ఓజీ అంటే ఏంటో అంతటా చర్చ జరిగింది. అందరూ చెప్పే మాట ఒకటే. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని. మాఫియా బ్యాక్డ్రాప్ కథ కాబట్టి అదే అయి ఉంటుందిలే అని అంతా అనేసుకున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం... ఓజీ అంటే అది కాదంట.
Continues below advertisement