Vishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP Desam

Continues below advertisement

  లైలా మెగా మాస్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన 11 మేకలు కామెంట్స్ పై పెద్ద కాంట్రవర్సీనే రేగింది. బాయ్ కాట్ లైలా అంటూ 25వేల ట్వీట్లు పడటంతో హీరో విశ్వక్ సేన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్షమాపణలు కోరారు. అసలు పృథ్వీరాజ్ ఆ కామెంట్స్ చేసినప్పుడు తను కానీ ప్రొడ్యూసర్ సాహూ గారపాటి కానీ సభలో లేమని చెప్పారు విశ్వక్ సేన్. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారు కాబట్టి తను ప్రొడ్యూసర్ ఇద్దరం బయటే ఉండిపోయామని అందుకే పృథ్వీ ఆ వ్యాఖ్యలు చేసిన సంగతి తనకు తెలియదని విశ్వక్ సేన్ చెప్పారు. ఒకవేళ ఈవెంట్ లో ఉంటే కచ్చితంగా పృథ్వీ చేసిన వ్యాఖ్యలను ఖండించేవాళ్లమని..తమ సినిమాను అందరూ చూడాలని కోరుకుంటామని క్లారిటీ ఇచ్చాడు విశ్వక్ సేన్. ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేసి ఫిబ్రవరి 14న వస్తున్న తమ సినిమా సూపర్ హిట్ చేయాలని కోరాడు విశ్వక్ సేన్. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram