Hero Vikram Injured In Thangalaan Movie Shooting: తంగలాన్ షూటింగ్ లో విక్రమ్ కు గాయం
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గాయం బారిన పడ్డాడు. పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న తంగలాన్ సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ స్టంట్ రిహార్సల్ చేస్తుంటే విక్రమ్ కు రిబ్స్ లో గాయమైంది. కనీసం ఓ నెల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో సర్జరీ కూడా చేయాల్సి రావొచ్చని వైద్యులు చెప్పినట్టు సమాచారం. విక్రమ్ కు గాయం కావడం వల్ల తంగలాన్ షూటింగ్ కు బ్రేక్ పడింది.