Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP Desam

Continues below advertisement

 గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది అందరూ చూసే ఉంటారు. డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషనలో ఎప్పటి నుంచో అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ లో ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. కొన్ని టాపిక్స్ గురించి కొంచెం డీటైలింగ్ తో మాట్లాడుకుందాం. మొదటిది సీజ్ ది షిప్ కాన్సెప్ట్. కడుపు నిండా వంద మద్దలు తినే ఏనుగు...ఒక్క ముద్ద వదిలి పెడితే దానికి వచ్చే నష్టం ఏం లేదు అని ట్రైలర్ లో స్టార్టింగ్ సీన్ చూపించారు. ఇదంతా బియ్యం బస్తాల గురించే సినిమాలో నడిచే సీన్స్ అని ట్రైలర్ లో షాట్స్ చూస్తేనే అర్థం అవుతోంది. పీడీఎస్ బియ్యాన్ని గోదామ్స్ లో స్టాక్ చేసుకుని అక్కడి నుంచి వేర్వేరు దేశాలకు స్మగుల్ చేసే గ్యాంగ్స్ ఆటకట్టిస్తాడు కలెక్టర్ గా రామ్ చరణ్. అదే విషయాన్ని బియ్యం స్మగ్లర్లకు కూడా చెబుతున్నట్లు చూపించాడు. సేమ్ ఇలానే కాకినాడ కలెక్టర్ షన్మోహన్ కూడా రీసెంట్ గా బియ్యాన్ని సీజ్ చేయటం తర్వాత పవన్ కళ్యాణ్ సీన్ లో కి ఎంటర్ అయ్యి సీజ్ ది షిప్ అనటం ఎంత హాట్ టాపిక్ అయ్యిందో గుర్తుంది కదా. ఆ సీన్ కి రిలేటెడ్ గా ఉండాలనే ట్రైలర్ లో జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థం అవుతోంది. రెండోది ఏంటంటే ఈవీఎంల ధ్వంసం. మొన్న ఏపీ ఎలక్షన్స్ టైమ్ లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంల ను ధ్వంసం చేసి కేసులో ఇరుక్కున్నారు. సేమ్ అలాంటి సీన్స్ కూడా గేమ్ ఛేంజర్ ట్రైలర్ లో ఉన్నాయి.మూడో విషయం ఏంటంటేఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేశారని...ఒకటి వింటేజ్ రోల్ లో చరణ్..అభ్యుదయం పార్టీ పెట్టినట్లుగా పల్లెటూరి మనిషి గెటప్ లో చరణ్ చూశాం కదా. రెండోది కలెక్టర్ రోల్ అన్నారు. కానీ ట్రైలర్ లో ఐపీఎస్ ఆఫీసర్ గానూ చూపించారు చరణ్ ను చాలా షాట్స్ లో. సో ముందు చరణ్ ఐపీఎస్ ఆఫీసర్. గోడౌన్స్ సీజ్ చేయటం లాంటివి చాలా చేసి ఉంటారు ఈ షాట్ లో చూడొచ్చు గుట్కా గౌడోన్ ఇది. తర్వాత తనకున్న పవర్స్ చాలాకనో లేదా మోర్ సర్వీస్ కోసమే మళ్లీ సివిల్స్ రాసి ఈ సారి ఐఏఎస్ క్రాక్ చేసినట్లు ఉన్నారు. హెలికాఫ్టర్ లో ఈ చరణ్ సూట్ బూట్ లో ఎంట్రీ షాట్స్ అప్పుడే కావచ్చు. సో అలా ఓ పొలిటికల్ డ్రామాలా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లై అర్థమవుతోంది. ఈవెంట్ లో శంకర్ గారు రివీల్ చేసినట్లు ఓ పొలిటీషయన్ కి, ఓ పబ్లిక్ సర్వెంట్ కి జరిగే డ్రామాలో మళ్లీ చరణ్ దే ఇంకో బ్యాక్ స్టోరీ ఉండటం...అది ఈ జరుగుతున్న స్టోరీకి లింక్ కావటం లాంటి మాంచి పొలిటికల్ యాక్షన్ డ్రామా అయితే ఈ సంక్రాంతి ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్సై పోయారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram