Floods At Gabbarsingh Re Release Chilakaluripet |నడుం లోతు నీళ్లలోనూ సినిమా చూస్తున్న ఫ్యాన్స్ |ABP

Continues below advertisement

Floods At Gabbarsingh Re Release Chilakaluripet |

మేము ట్రెండ్ ఫాలో అవ్వము. ట్రెండ్ సెట్ చేస్తాం అని పదే పదే నిరూపించుకుంటున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు. ఇక్కడ చూడండి..నడుం లోతు నీళ్లు ఉన్నాయి థీయేటర్ లో ఐనా... సరే గబ్బర్ సింగ్ ను చూస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్...! సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ గా మారాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో భారీ వర్షాల కారణంగా థియేటర్ లోకి భారీగా వరద నీరు చేరుకుంది. ఐనప్పటికీ.... పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోసం గబ్బర్ సింగ్ సినిమాను ప్రదర్శించారు. ఫ్యాన్స్ వరద నీరు ఉందనే విషయం మరచిపోయి మరి చిందేశారు. ఇప్పటి వరకు ఎన్ని రిరీలీజ్ లు జరిగినా.... వరదలను మాత్రం ఎదురించే క్రేజ్ ఒక్క గబ్బర్ సింగ్ కే ఉందని ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. నార్మల్ గా ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్ బంద్ చేస్తారు. కానీ, ఇక్కడ థియేటర్ రన్ చేస్తున్నారు అంటే మేబీ ఆ థియేటర్ ఓనర్ కూడా పవన్ కల్యాణ్ ఫ్యాన్ ఐ ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram