Fight Club Movie Decode in Telugu | పాతికేళ్లుగా వెంటాడే ప్రశ్నలను సంధిస్తూనే ఉన్న ఫైట్ క్లబ్ | ABP
మొబైల్ ఆన్ చేస్తే చాలు ఇంట్లోకి సరుకులు కావాలా పదినిమిషాల్లో మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేస్తామని ఒక యాడ్ వస్తుంది. రోడ్ మీదకు వెళ్తే రోడ్ సైడ్ పెద్ద హోర్డింగ్ కనిపిస్తుంది..మా క్రీమ్ వాడితే నల్లగా ఉన్న మీరు పది రోజుల్లోనే తెల్లగా మారిపోతారు అని ఒకటి. వంద కిలోల బరువు ఉన్నారా మా దగ్గర జాయిన్ అవ్వండి...నలభై కేజీలు తగ్గిపోండి అని ఇంకొకటి కనిపిస్తుంది. ఎన్నాళ్లు అలా అద్దెలు కట్టుకుంటూ బతుకుతారు... మా లగ్జరీ హౌస్ వెంచర్ లో మీ డ్రీమ్ హౌస్ కొనుక్కోండి 2BHK జస్ట్ కోటి రూపాయలు మాత్రమే అని ఓ హోర్డింగ్... ఉద్యోగాలతో అలసిపోయి ఉన్నారా మనాలి తీసుకెళ్తామని మరొకటి...మా పబ్ కి రండి ఈ వీకెండ్ కి దుమ్ము దుమారం చేద్దాం అని ఇంకొకటి. ఇక ఇష్టమైన హీరోల సినిమాలు..మల్టీప్లెక్సుల విలాసాలు...వీపు మోత మోగించే పాప్ కార్న్ లు...సినిమా అయ్యాక ఫైవ్ స్టార్ హోటల్ భోజనాలు. నీ జీతమేమో నెలకు మహా అయితే యాభై నుంచి లక్ష రూపాయల లోపు ఉంటుంది. కానీ వీళ్లు నీతో పెట్టించాలనుకుంటున్న ఖర్చుకు ఎదురు నువ్వే అప్పులు చేయాలి. ఈఎంఐలు..గోదారి గోల. ఇది సగటు మధ్యతరగతి ఉద్యోగి వ్యథ. ఆఫీసులో బాసు తిట్లు....తోటి ఎంప్లాయిస్ తో ఇగో క్లాషెస్...శ్రమ దోపిడీలు...బయటకొస్తే ఇలా జ్యూస్ పిండేసే రేంజ్ లో క్యాపిలిస్టిక్ ప్రపంచం...బుర్ర హీటెక్కిపోతోంది కదా. మనిషిని ఊపిరి తీసుకోనివ్వకుండా అల్లాడిస్తున్న మెటీరిలియజాన్ని, కార్పొరేట్ కల్చర్ ని గోప గుయ్యుమనేలా 1990ల్లోనే ప్రశ్నించింది ఓ సినిమా. అదే ఫైట్ క్లబ్(Fight Club). ఈ వారం హాలీవుడ్ ఇన్ సైడర్(Hollywood Insider) ఫైట్ క్లబ్ స్పెషల్.