Dil Raju Shirish Ram Charan Game Chnager Controversy | గేమ్ ఛేంజర్ చుట్టూ గరం గరం డిబేట్ | ABP Desam

సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచి, నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, కంటెంట్ తో మెప్పించలేకపోవటంతో అభిమానుల రిజెక్షన్ ను ఎదుర్కోక తప్పలేదు.  అయితే అప్పటి నుంచి మౌనంగా ఉన్న SVC బ్యానర్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, ఒకే రోజు రెండు వేర్వేరు స్టేట్మెంట్స్ ఇవ్వటం ద్వారా గేమ్ ఛేంజర్ టాపిక్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ రెండు స్టేట్మెంట్లు తెరపైకి వచ్చిన వెంటనే, గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్‌కు అసలు కారణం ఎవరు? అనే డిబేట్ మరింత వేడెక్కింది.వీరివే వాదనలు కావచ్చుగానీ, కొన్ని గట్టిగా వినిపిస్తున్న కీలక పాయింట్లు ఇవే దర్శకుడు శంకర్ డ్యూయల్ ప్రాజెక్టుల వల్ల ఫోకస్ కోల్పోయారా?  పాత్ర మిక్స్డ్ రిసెప్షన్ కు కారణమైందా? స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ లో ఉన్న లోపాలు సినిమాను డిజాస్టర్ దిశగా నడిపించాయా? భారీ బడ్జెట్ అంచనాలకు తగిన కంటెంట్ అందలేదా? ఈ వీడియోలో వాస్తవ పరిస్థితులు, బాక్సాఫీస్ నంబర్లు, ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయాలు అన్నీ గమనిస్తే, గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ వెనుక ఉన్న అసలు కారణాలు మీకు స్పష్టంగా తెలుస్తాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola