Dhanush Tirumala Darshan with Sons | కుమారులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో హీరో ధనుష్ | ABP Desam

Continues below advertisement

 హీరో ధనుష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన ఇద్దరు కుమారులతో కలిసి స్వామి వారి దర్శనానికి వచ్చిన ధనుష్ స్వామి వారి తోమాల సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం బయటకు వచ్చిన ధనుష్ ను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ధనుష్ తో ఫోటోలు దిగేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఫలితంగా ధనుష్ ఆలయం నుంచి బయటకు వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ధనుష్ తో పాటు ఆయన కుమారుడు యాత్రరాజ్, లింగరాజ్ ఉన్నారు. ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర రాజ్ 20 ఏళ్లు కాగా చిన్న కుమారుడు లింగ రాజ్ వయస్సు 16ఏళ్లు. పెద్ద కుమారుడు పూర్తిగా ధనుష్ టీనేజ్ లో ఉన్నట్లు లుక్స్ తో ఉండటం ఫ్యాన్స్ ను ఆకర్షించింది. అంతే కాకుండా అన్నదమ్ములిద్దరూ తమ తండ్రి మీద అభిమానులు పడిపోకుండా ప్రొటెక్ట్ చేసుకోవటం కనిపించింది. తండ్రికి ఉన్న ప్రాచుర్యం దృష్ట్యా ఆయన కుమారులిద్దరూ ఇలా తండ్రి కి రక్షణగా ఉన్నారని అభిమానులు చర్చించుకున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola