వివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్

Continues below advertisement

సాయి పల్లవికి ఏ రేంజ్‌లో ఫ్యాన్ బేస్ ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా... బోలెడంత పేరు సంపాదించుకుంది. ఏదైనా సినిమా రిలీజ్ ఉంటే తప్ప పెద్దగా మీడియాలో కనిపించదు. కానీ... ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆమె పేరే వినిపిస్తోంది. బాయ్‌కాట్ సాయిపల్లవి అనే హ్యాష్ ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. అనుకోకుండా ఓ వివాదంలో ఇరుక్కుంది. విరాటపర్వం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలోఇంటర్వ్యూలో ఇండియన్ ఆర్మీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది సాయి పల్లవి. పాకిస్థాన్ వాళ్లని మనం ఎలాగైతే ఉగ్రవాదులుగా చూస్తామో..పాకిస్థాన్ వాళ్లు కూడా ఇండియన్ ఆర్మీని ఓ టెర్రరిస్ట్ గ్రూప్‌గానే చూస్తుందని కామెంట్స్ చేసింది. ఇంత హింసకు ఎందుకు పాల్పడతారో తెలియదని చెప్పింది. అమరన్ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉన్న టైమ్‌లో..ఈ పాత వీడియోని బయటకి తీసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.  

తన ఇంటెన్షన్‌ ఎలా ఉన్నా..ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. దేశ రక్షణ కోసం ఎంతో శ్రమిస్తున్న సైనికులను టెర్రరిస్ట్ గ్రూప్‌తో పోల్చుతావా అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. అయితే..సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం అనవసరంగా దీన్ని రచ్చ చేస్తున్నారంటూ మండి పడుతున్నారు. పాత వీడియోని తీసుకొచ్చి...ఆమె చేసిన కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారని అంటున్నారు. ఆమెని డిఫెండ్ చేస్తున్నారు. ట్విటర్‌లో #BoycottSaiPallavi హ్యాష్‌ట్యాగ్‌ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ సాయి పల్లవి ఈ కాంట్రవర్సీపై స్పందించలేదు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మధ్యే సాయి పల్లవి ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ని సందర్శించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ లోగా ఈ కాంట్రవర్సీ మొదలైంది. అక్టోబర్ 31న అమరన్ సినిమా రిలీజ్ కానుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram