Bhagavanth Kesari National Award | జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి | ABP Desam

 నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో శ్రీలీల కీలకపాత్రలో నటించిన భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు దక్కింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో 2023లో రిలీజైన భగవంత్ కేసరిని జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ జ్యూరీ గౌరవించింది. స్త్రీ స్వశక్తికి పెద్ద పీట వేస్తూ శ్రీలీలను స్ట్రాంగ్ లేడీగా  ఎలివేట్ చేస్తూ బాలయ్య లాంటి లెజండరీ యాక్టర్ నటించిన సినిమా జాతీయ స్థాయిలో జ్యూరీని మెప్పించగా..  చిన్నారులకు ముఖ్యంగా ఆడపిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటి కచ్చితంగా చెప్పి తీరాల్సిన టాపిక్స్ ను కమర్షియల్ సినిమాలో ఇనుమడింప చేసిన విధానాన్ని నేషనల్ జ్యూరీ మెచ్చుకుంటూ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరిని ప్రకటించింది. ఇదే ఏడాది సినీరంగానికి అందించిన సేవలకు గానూ పద్మభూషణ్ ను అందుకున్న నందమూరి బాలకృష్ణకు ఇదే ఏడాది తన సినిమాకు జాతీయ అవార్డు రావటం డబుల్ బొనాంజా అని చెప్పాలి. అందుకే బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola