
AR Rahman Wife Saira Rahman | ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సైరా రెహ్మాన్ | ABP Desam
ఏఆర్ రెహమాన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తున్నట్లు ఆయన భార్య సైరా రెహమాన్ తెలిపారు. ఏఆర్ రెహమాన్ కు ఛాతీలో నొప్పి రావటంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారని ఆయనకు ఏంజియో గ్రామ్ చేశారని తెలిసిందని ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు సైరా భాను మీడియాకు ఓ ఆడియో క్లిప్ విడుదల చేశారు. ఇదే సమయంలో ఏఆర్ రెహమాన్, ఆమె ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదని చెప్పారు. ఎక్స్ వైఫ్ అంటూ తన గురించి రాస్తున్నారని రెండేళ్లుగా ఆరోగ్యం బాగాలోకే పోవటంతో దూరంగా ఉంటున్నాని చెప్పారు సైరా రెహ్మాన్. ఆ సమయంలో తనకు రెహమాన్ అండగా నిలబడ్డారన్న సైరా..ఇప్పుడు తను రెహ్మాన్ కోసం ప్రార్థించాల్సిన సమయం అన్నారు. 2024 నవంబర్ లో 29 సంవత్సరాల దాంపత్య జీవితం తర్వాత రెహ్మాన్, ఆయన భార్య సైరా విడిపోతున్నట్లు ప్రకటన చేశారు. కానీ దాదాపు ఐదు నెలల విరామం తర్వాత తామింకా విడిపోలేదని కష్ట సమయంలో రెహ్మాన్ కు తను తోడుగా ఉంటానని చెప్పారు సైరా