Oscar 2025 | 97వ ఆస్కార్‌ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన అనోరా సినిమా | ABP Desam

ఆస్కార్‌ అవార్డుల్లో ‘అనోరా’ అనే రొమాంటిక్‌ చిత్రం పేరు మార్మోగిపోయింది. మొత్తం ఐదు ఆస్కార్లను దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. Best Picture, Best Actress, Best Director, Best Screenplay, and Best Editing విభాగాల్లో పురస్కారాలను అందుకుంది అనోరా.  


సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది అవార్డు ఆస్కార్. ఈ అవార్డును ఒక్కసారైనా అందుకోవాలని ప్రతీ ఒక ఆర్టిస్ట్‌, టెక్నీషన్‌, నటులు అనుకుంటూ ఉంటారు. ఈ అవార్డులు ప్రధానోత్సవం కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజిల్స్‌లో డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా సాగింది. ఈ వేడుకకు సినీ తారలతోపాటు టెక్నీషియన్స్‌ కూడా హాజరయ్యారు. ఆస్కార్‌ అవార్డుల్లో ‘అనోరా’ అనే రొమాంటిక్‌ చిత్రం పేరు మార్మోగిపోయింది. మొత్తం ఐదు ఆస్కార్లను దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. Best Picture, Best Actress, Best Director, Best Screenplay, and Best Editing విభాగాల్లో పురస్కారాలను అందుకుంది అనోరా. 

అసలు ఈ సినిమాకి ఎందుకు ఇన్ని అవార్డ్స్ వచ్చాయి అని అందరు ఆరా తీస్తున్నారు. ఈ కథ అంత బాగుంటుందా అని ప్రశ్నిస్తున్నారు కూడా. 
అనోరా ఒక ప్రాస్టిట్యూట్ స్టోరీ. రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించారు. రష్యాకి చెందిన ఒక కోటీశ్వరుడి కుర్రాడు చదువుకోవడానికి అమెరికా వస్తాడు. అక్కడ 23 ఏళ్ల వేశ్యని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడిపోతాడు. పెళ్లికూడా చేసుకుంటాడు. ఈ విషయం ఆ కుర్రాడి పేరెంట్స్ కి నచ్చదు. ఈ పెళ్లిని అంగీకరించరు. సో వాళ్ల అబ్బాయిని మల్లి రష్యా తీసుకోని వెళ్ళిపోతారు. దీంతో ప్రాస్టిట్యూట్ అయిన ఆ కుర్రాడి భార్య ఎం చేస్తుంది ? మళ్ళి అతని కలుస్తుందా అనేది మిగతా స్టోరీ. దాదాపు 6 మిలియన్‌ డాలర్లుతో ఈ సినిమాని రూపొందించారు. అంటే మన కరెన్సీలో రూ.52 కోట్లు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 41 మిలియన్‌ డాలర్లు అంటే రూ.358 కోట్లు అందుకొని రికార్డులు సృష్టించిందీ. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola