
Anil Ravipudi Cringe Movies Director | Sankranthiki Vasthunnam తో వందకోట్లు కొట్టినా వేస్ట్ డైరెక్టరేనా.? | ABP Desam
అనిల్ రావిపూడి. టాలీవుడ్ లో ఒక యంగ్ డైరెక్టర్. తన కెరీర్ లో 8 సినిమాలు తీస్తాడు. నీకు నచ్చినా నచ్చకున్నా అన్నీ హిట్లు కొట్టాడు. ఇక్కడ హిట్ అనే మాటకు ప్రామాణికం ఏంటీ బాస్...F3 హిట్టా అని మీరు అడగొచ్చు. అది మళ్లీ మాట్లాడుకుందాం. కానీ ఇన్ని సినిమాలు సక్సెస్ ఫుల్ గా సింగిల్ హ్యాండ్ గణేశ్ లా నడిపినా అనిల్ రావిపూడి క్రింజ్ సినిమాలు తీసే క్రింజ్ డైరెక్టర్. ఇది ఆయనపై ఉన్న ఆరోపణ. డీటైల్డ్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో.
సంక్రాంతి కి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి తెలుగులో. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, నందమూరి బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్, మూడోది విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూడు సినిమాల్లో ఏది మంచి సినిమా...ఏది ఎక్కువ మందిని ఎంటర్ టైన్ చేసింది అని డిస్కషన్.
ఈ డిస్కషన్ లో ఎవరి అభిప్రాయం వాళ్లది. చరణ్ అప్పన్నగా చితక్కొట్టేశాడు కానీ డైరెక్టర్ శంకర్ ఆయన ప్రైమ్ ను దాటేశారు. అందుకే కొంచెం జమానా కాలం నాటి కాన్సెప్టుతో వస్తున్నారనేది గేమ్ ఛేంజర్ మీద వచ్చిన క్రిటిసిజం. ఇంక డాకు అయితే సరే సరి. మాస్ గాడ్ గా బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్ కి... బాబీ స్క్రీన్ ప్లే తోడై...యాజ్ యూజువల్ గా నందమూరి తమన్ బీజీఎం యాడై...సంక్రాంతికి మంచి నాన్ వెజ్ మీల్స్ పెట్టిందనేది టాక్. అసలు ఈ కాంపిటీషన్ నిలబడటానేకి ఆస్కారం లేదన్నట్లుగా క్రిటిక్స్ విపరీతంగా మాట్లాడేస్తున్న సినిమా మాత్రం సంక్రాంతికి వస్తున్నాం.