Pushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam
పుష్ప 2 సినిమా రోజు రోజుకూ కలెక్షన్ల సునామీని మరింత పెంచేస్తోంది. నాలుగు రోజులకు వరల్డ్ బాక్సాఫీస్ నుంచి ఏకంగా 829 కోట్ల రూపాయలు రాబట్టింది పుష్ప 2. 800కోట్ల మార్కును అత్యంత వేగంగా అందుకున్న చిత్రంగా RRR పేరు మీదున్న రికార్డును బ్రేక్ చేసింది పుష్ప 2. గురువారం విడుదలైన సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావటంతో...శుక్ర, శని, ఆదివారాల్లో కలెక్షన్ల జాతర కురిసింది. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఓవర్సీస్ తేడా లేకుండా అల్లు అర్జున్ యాక్టింగ్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో కాసుల వర్షం కురుస్తోంది. ఈ రోజు నుంచి థియేటర్లలో టిక్కెట్ల రేట్లు కాస్త తగ్గుముఖం పట్టడంతో సినిమా అసలైన సత్తా సోమవారం నుంచి తెలియనుంది. ఈ జోరు ఇలానే కొనసాగితే ఈ వారాంతానికి RRR లైఫ్ టైమ్ రికార్డు 1200 కోట్లను దాటి బాహుబలి 2 సాధించిన 1800 కోట్ల రికార్డు దిశగా దూసుకెళ్లనుందని ఫిలిం ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సుకుమార్ టేకింగ్, అల్లు అర్జున్ యాక్టింగ్ కు అభిమానులు వెర్రెత్తిపోతుండటంతో రికార్డులన్నీ రపా రపా అంటూ బద్ధలు అయిపోతున్నాయి.