Pushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desam
ఎప్పుడైతే జక్కన్న బాహుబలి మొదలు పెట్టాడో అప్పుడు మొదలైన సౌత్ సినిమా ప్రత్యేకించి తెలుగు సినిమా ప్రభంజనం పుష్ప 2 తో ఎక్కడికో వెళ్లిపోయింది. పుష్ప 2 తమాషా ఏంటంటే బాలీవుడ్ హయ్యెస్ట్ సింగిల్ డే కలెక్షన్లను ఒకే సినిమా మూడుసార్లు బ్రేక్ చేసింది. మొదటి రోజు 72 కోట్లు సాధించి జవాన్ పేరు మీదున్న 65కోట్ల ఫస్ట్ డే కలెక్షన్లను బద్ధలు కొట్టిన పుష్ప 2 బాలీవుడ్ చరిత్రలో ఓ సినిమా సాధించిన తొలి రోజు కలెక్షన్లను తన పేరు మీద రాసుకుంది. అక్కడితో ఆగిపోలేదు. రెండో రోజు కాస్త తగ్గినట్లు అనిపించినా...మూడోరోజు అంటే శనివారం 74కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి తనే మొదటి రోజు క్రియేట్ చేసిన రికార్డు బ్రేక్ చేశాడు బన్నీ. ఇప్పుడు అదీ చాలదన్నట్లు ఆదివారం ఏకంగా 86కోట్లు సాధించి తిరుగులేని మరో సింగిల్ డే రికార్డును సెట్ చేసింది పుష్ప2. బాలీవుడ్ చరిత్రలో ఇప్పుడు ఓ రోజులో అత్యధిక కలెక్షన్లను పుష్ప 4వరోజు కొట్టిందంటే అది మాములు ఫీట్ కాదు. పుష్ప బ్రాండ్ మీద ప్రత్యేకించి అల్లు అర్జున్ మీద నార్త్ ఆడియెన్స్ కురిపిస్తున్న అన్ కండీషనల్ లవ్ కి ఇదే గ్రేట్ ఎగ్జాంపుల్. సౌత్ సినిమా మీద బాలీవుడ్ ప్రేక్షుకులు పెంచుకుంటున్న ప్రేమ..కురిపిస్తున్న కలెక్షన్లు చూసి హిందీ చిత్ర సీమ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.