మళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా
వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరు పొందిన వేణుస్వామి.. తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. అల్లు అర్జున్ జాతకం గురించి, ఆయన భవిష్యత్తు గురించి గతంలో తాను వివిధ ఛానెళ్లలో చేసిన వ్యాఖ్యలను కలిపి ఓ వీడియోను విడుదల చేశారు. రాబోయే పది పదిహేనేళ్లు.. అల్లు అర్జున్ జాతకం బావుంటుందని.. పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతారని పాత వీడియోల్లో వేణుస్వామి చెప్పారు. నిర్మాతలకు మినిమమ్ గ్యారంటీ హీరోగా అల్లు అర్జున్ ఉంటారని ఆ వీడియో క్లిప్పుల్లో వేణుస్వామి చెప్పారు. తాను పుష్ప 2 సినిమా చూశానని బావుందని చెప్పుకొచ్చారు. కొద్ది వారాల క్రితం నాగచైతన్య - శోబిత నిశ్చితార్థంపై స్పందిస్తూ వారి వైవాహిక జీవితంపై వేణుస్వామి జాతకం చెప్పిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం విపరీతంగా వివాదాస్పదం అయింది. దాంతో తాను ఇక సెలబ్రిటీల జాతకాల జోలికి పోనని వేణుస్వామి అప్పుడే వీడియో విడుదల చేశారు. తాజాగా అల్లు అర్జున్ జాతకం గురించి తాను గతంలో చెప్పిన జాతకానికి సంబంధించిన క్లిప్పులను జత చేస్తూ వీడియో విడుదల చేశారు.