Allu Arjun 42 New Rules Viral Video | బన్నీతో మాట్లాడాలంటే 42 రూల్స్ ఉన్నాయా.? వైరల్ వీడియోలో నిజమెంత.? | ABP Desam

Continues below advertisement

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కలవాలనుకుంటున్నారా..అయితే మీరు 42 రూల్స్ పాటించాల్సిందే అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ రూల్స్ ఏంటంటే అల్లు అర్జున్ తో మాట్లాడేప్పుడు ప్రత్యేకించి ఇంటర్వ్యూల టైమ్ లో ఆయన కళ్లల్లో కళ్లు పెట్టి చూడకూడదు. అల్లు అర్జున్ ఇవ్వకుండా మనం ముందు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు....ఆయన ఉన్నప్పుడు పెద్దగా శబ్దం చేయకూడదు..అటూ ఇటూ తిరుగుతూ డిస్ట్రబ్ చేయకూడదు ఇలాంటి 42 రూల్స్ అల్లు అర్జున్ టీమ్ తనకు చెప్పిందంటూ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా చెబుతున్న వీడియోలో ఇవాళ సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అవుతోంది. హాలీవుడ్ లో టామ్ క్రూజ్ లాంటి నటులకు ఇలాంటి ఐ కాంటాక్స్ట్ ఇవ్వకూడదు అనే రూల్స్ ఉండేవట. సరే ఇండియాలో సినిమా అభిమానులు ఎక్కువగా ఉండే దేశంలో ఇలాంటి రూల్స్ పెట్టుకోవటం ఐకాన్ స్టార్ కి కరెక్టేనా అంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. అయితే ఈ వీడియో అల్లు అర్జున్ టీమ్ దృష్టికి కూడా వెళ్లినట్లుంది. ఇది కంప్లీట్ గా నాన్సెన్స్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది బన్నీ టీమ్. అల్లు అర్జున్ అందరిపట్ల ఎంతో గౌరవంతో వినయంతో ఉండే మనిషి అంటూ చెప్పిన అల్లు అర్జున్ టీమ్...ఈ వీడియో మాట్లాడిన వ్యక్తిపై పరువు నష్టం దావా వేస్తామంటూ ఓ అఫీషియల్ లేఖను విడుదల చేసింది. సో ఫ్యాన్స్ మన పుష్పరాజ్ తో కళ్లల్లో కళ్లు పెట్టి మాట్లాడొచ్చు అన్నమాట..తగ్గేదేలే అని కూడా అనొచ్చు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola