Akhanda2 Thaandavam Teaser Review | మంచు కొండల్లో..తీవ్రవాదులను మట్టుబెడుతున్న Balakrishna | ABP Desam

 నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న సినిమా అఖండ తాండవం. అఖండ 2 గా అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ ను రేపు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. మొదటి భాగంలోలానే అన్యాయం పై, అధర్మంపై ఉక్కు పాదం మోపే అఘోరాగా బాలయ్య మరోసారి టీజర్ లో విశ్వరూపం చూపించాడు. అయితే ఈ సారి పహల్గాం అటాక్ కు బాలయ్య తన సినిమాతో ట్రిబ్యూట్ ఇచ్చినట్లుగా టీజర్ లో మొదటి షాట్స్ చూస్తుంటే. ఎన్నో ఏళ్లుగా తపస్సులోనే ఉండిపోయిన అఘోరాకి ఉన్నట్లు భారీ గడ్డం, మీసాలు, పొడవాటి కేశాలతో కనిపిస్తున్న బాలకృష్ణ కొంత మంది మిషన్ గన్స్ పట్టుకున్న వాళ్లను అడ్డుకుంటున్నట్లుగా ఉంది టీజర్ లో. నా శివుడి అనుమతి లేనిది యుముడైనా ముట్టలేడు అలాంటిది నువ్వు చూస్తావా..అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలకృష్ణకు డైలాగ్ పెట్టారు. మెషీన్ గన్స్ పట్టుకున్న ముసుగు వ్యక్తులను గాల్లోకి విసిరేసి తన త్రిశూలాన్ని మెడచుట్టూ తిప్పుతూ ముష్కర మూకల ప్రాణాలను గాల్లో కలిపేసినట్లు బాలయ్య ఇంట్రో షాట్స్ చూపించారు. వేదం చదివిన శరభం యుద్ధానికి దిగిది అంటూ బాలయ్య నిప్పులోకి దూకుతున్న మరో షాట్ కూడా చూపించారు. విలన్ కళ్లు మాత్రమే చూపించారు. చూడటానికి ఆది పినిశెట్టి లా ఉన్నాడు. ఎస్ ఎస్ థమన్ బీజీఎం, బోయపాటి టేకింగ్ మరోసారి గూస్ బంప్స్ తెప్పించటం ఖాయం అనిపిస్తోంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న తాండవం చేయటానికి దిగుతున్నాడు అఖండ చూడాలి మరి ఈసారిగా స్క్రీన్లు తగలబెట్టేస్తాడేమో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola